నీ చరితం అజరామరం




నీ చరితం అజరామరం


అజరం ... అమరం ...
నీ చరిత అమరావతి...
దేశ-దేశాలెల్ల నీ కీర్తి ఘనంగా...
వేనోళ్ల కొనియాడె అమరావతి..

ఒకనాటి జ్ఞాన-విజ్ఞాన కేంద్రమై..
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధక్షేత్రమే...
పంచారామాలలో మొదటిదై..
అమరేశ్వరుని దివ్య దర్శనమై..
దేవేంద్రుని చేత పూజలందుకొన్నదే...
బౌద్ధ-హిందూ ధర్మాల వైభవమై..
వెలుగొందిన దివ్యక్షేత్రమే...
నేటి మన రాజధాని ..అమరావతి..

ఆచార్య నాగార్జునుని దివ్య తేజస్సుతో..
బౌద్ధమతానికే ప్రేరణయై...
వాసిరెడ్డి వెంకటాద్రి నాయుని పాలనలో...
ఆంధ్రుల శిల్పకళా నైపుణ్యమై...
భరత జాతికే వన్నె తీసుకొచ్చి...
చరిత్ర పుటల్లో నిలచిన  అమరావతి..

తెలుగు జాతికానందమై...
ఆంధ్ర ప్రదేశానికి రాజధానియై..
పునర్వైభవం కోరుతున్న అమరావతి..


చేయి-చేయి కలుపుకుంటూ..
చేయూతగా ముందుకడుగేసుకుంటూ...
నేను సైతమొకనిటుకనంటే...
పులకించిపోదా..మన అమరావతి...

అజరం ... అమరం ...
నీ చరిత అమరావతి...
దేశ-దేశాలెల్ల నీ కీర్తి ఘనంగా...
వేనోళ్ల కొనియాడె అమరావతి..
(Published in EENADU Paper on 20-10-2015 Kadapa edition on 15 Page )

Comments

Popular posts from this blog

తెలుసుకుందాం ...చండాలులు ఎవరు? ఎలా ఏర్పడ్డారు?

दलित साहित्य क्या है ?